కడప జిల్లాలో లాక్ డౌన్ అమలవుతున్న దృష్ట్యా ఇళ్ల వద్దకే నిత్యావసరరాలు సరఫరా చేసేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. జిల్లాలో 28 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను పోలీసులు రెడ్ జోన్ గా ప్రకటించి రాకపోకలకు నిలిపివేశారు. రెడ్ జోన్ పరిధిలో నివసిస్తున్న వారి ఇళ్ల వద్దకే నిత్యావసర వస్తువులు అందించేందుకు ఐటీసీ సంస్థ సహకారంతో మొబైల్ వాహనాలను ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలీస్ కంట్రోల్ నంబర్ కు ఫోన్ చేస్తే... వస్తువులు వారి ఇళ్ల వద్దకే సరఫరా చేస్తామని ఎస్పీ అన్నారు. లాక్ డౌన్ పూర్తయ్యే వరకు నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి.