కడప జిల్లా శేషాచలం అడవుల్లో అటవీ శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. అడవిలో ఎర్రచందనం నరికి అక్రమంగా రవాణా చేస్తున్న స్మగ్లర్లు, కూలీలను గమనించిన అధికారులు చాకచక్యంగా వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.15 లక్షల విలువైన 22 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారంతో తనిఖీలు చేయగా ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తున్నట్లు గుర్తించి.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరికొందరు పరారైనట్లు.. అటవీ శాఖ సబ్ డివిజన్ అధికారి షణ్ముఖకుమార్ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి పరారైన వారి కోసం గాలింపు చేపడుతున్నామని అన్నారు. దాడుల్లో రాయచోటి రేంజ్ అధికారి మురళీకృష్ణ, అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి