ఉపాధి కల్పించాలని క్యాంటీన్ ముందర నిరసన చేపట్టిన అన్న క్యాంటీన్ సిబ్బంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.5కే పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన అన్న క్యాంటీన్లు మూతపడబోతున్నాయి. అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి ఏడాది కాంట్రాక్టు అక్షయపాత్ర ఫౌండేషన్‌తో ప్రభుత్వం కుదుర్చుకోగా...ఆ గడువు రేపటితో ముగియనుంది. ఈ కాంట్రాక్ట్ పొడిగింపుపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పేదలకు అన్నం పెట్టే అన్న క్యాంటీన్లు మూతపడతున్నాయి అని తెలిసి.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలోని అన్న క్యాంటీన్ కాంట్రాక్ట్ సమయం ముగియటంతో క్యాంటీన్‌ను మూసివేశారు. క్యాంటీన్ మూసివేతతో ఉపాధి కొల్పోతున్నామని సిబ్బంది నిరసన వ్యక్తం చేశారు. క్యాంటీన్ తెరచి పని కల్పించాలని కోరుతున్నారు.
ఇది చూడండి: జాబిల్లి వైపు చంద్రయాన్ మూడో అడుగు