మద్యం మహమ్మారి ఆ అన్నదమ్ముల మధ్య గొడవ పెట్టింది. చివరికి అన్న తిమ్మయ్య చేతిలోనే వరుసకు తమ్ముడైన తిమ్మయ్య ప్రాణాలు పోగొట్టుకున్నాడు. కడప జిల్లా సుండుపల్లె మండలం పెద్దగొల్లపల్లెలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం...మృతుడు తిమ్మయ్య ఇంట్లో వరుసకు అన్నయ్య అయిన తిమ్మయ్య (అతని పేరు కూడ తిమ్మయ్యే), మరో గ్రామస్తుడు, ముగ్గురూ కలిసి మద్యం సేవించారు. విచ్చలవిడిగా మద్యం తాగాక.. మత్తులో మాటామాటా పెరిగి తమ్ముడు తిమ్మయ్య, అన్న తిమ్మయ్య మధ్య వాగ్వాదం జరిగింది. తమ్ముడు తిమ్మయ్యను అన్న రోకలిబండతో చితకబాది చంపేసి ఇంటి బయట ముళ్ళపొదల్లో పడేశాడు. నిందితుల్లో ఒకరైన రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిమ్మయ్య పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇదీ చదవండి: అప్పుల బాధతో రైతు బలవన్మరణం