కడప జిల్లా బద్వేలు బాలికల ఉన్నత పాఠశాల ప్రహరి గోడ నిర్మాణం పనులు ఆలస్యంపై ప్రజా ప్రయోజనాల లోక్ అదాలత్ సర్వ శిక్షా అభియాన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ నిధులతో సకాలంలో పనులు ఎందుకు చేయలేదో నివేదికను అందజేయాలని కోరింది. అసిస్టెంట్ ఇంజనీర్... బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీగోడ నిర్మాణానికి ఓ వ్యక్తి అభ్యంతరం చెప్తున్నాడని, వివరణ ఇచ్చారు. సదరు వ్యక్తిపై బద్వేలు పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కేసును జూలై 2కి వాయిదా వేసింది. ఈనాడు, ఈటీవీ భారత్లో బాలికల ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ లేక పడుతున్న ఇబ్బందులు విశ్లేషిస్తూ కథనం వచ్చింది. ఈ కథనంపై స్పందించిన జిల్లా ప్రజా సాధికార న్యాయ సంస్థ న్యాయవాది శివప్రసాద్ కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి.
డీప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించటం ఆనందంగా ఉంది : అంజాద్ బాషా