ఒకరికి కరోనా సోకిందని తమ ప్రాంతాన్ని రెడ్ జోన్‌గా మార్చి... తర్వాత తమను పట్టించుకోవడం లేదని.. కడప జిల్లా రాజంపేట పరిధిలోని ఈడిగపాలెం గ్రామస్థులు వాపోయారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన పురపాలక కమిషనర్ రాజశేఖర్‌కు తమ గోడు వెల్లబోసుకున్నారు. రెడ్ జోన్లో ఉన్న తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు.
మంచినీరు రావడంలేదని.. అప్పుడప్పుడు వచ్చే కూరగాయలు అధిక రేట్లు ఉంటున్నాయని చెప్పారు. రెక్కాడితే కాని జీవనం సాగని తాము అంతంత రేట్లు పెట్టి తాగునీరు, కాయగూరలు కొనలేకపోతున్నామని ఆవేదన చెందారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు.
ఇవీ చదవండి... ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి తప్పిన ప్రమాదం