దిల్లీలోని మతపరమైన ప్రార్థనా సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిలో.. ప్రొద్దుటూరుకు చెందిన ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలడంపై అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ పశువైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాన్ని శుద్ధి చేశారు. పురపాలిక, పారిశుద్ధ్య కార్మికులంతా కలసి.. క్రిమిసంహారక మందులను క్వారంటైన్ గదుల్లో, ఆరుబయట పిచికారీ చేశారు. తాగునీటి సంపులో బ్లీచింగ్ పౌడర్ కలిపారు. క్వారంటైన్ పరిసరాల్లో సున్నం చల్లారు. రోగ లక్షణాలు కలిగిన కుటుంబ సభ్యులను క్వారంటైన్ కేంద్రానికి తరలించేందుకు సన్నహాలు చేపట్టారు.
ఇదీ చదవండి: