కడప జిల్లా రాజంపేట పట్టణంలో జనతా కర్ఫ్యూ కారణంగా నిత్యం ప్రజలు, వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ప్రాంతాలన్నీ నిశ్శబ్దంగా మారాయి. కడప, తిరుపతి, నెల్లూరు, బెంగళూరుకు వెళ్లే జాతీయ రహదారులన్నీ బోసిపోయాయి. డీఎస్పీ నారాయణస్వామి రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. పురపాలక కమిషనర్ రాజశేఖర్ పారిశుద్ధ్య పనులు పర్యవేక్షిస్తూ అపరిశుభ్రత ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్, దోమల నివారణకు మందులను పిచికారి చేయించారు. జనతా కర్ఫ్యూకు ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు.
ఇదీ చదవండి: కరోనాపై పోరు: మార్చి 31 వరకు ఆ రాష్ట్రం బంద్