కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలో తాగునీటి ఎద్దడిపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ప్రభుత్వానికి ప్రణాళికలు పంపినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వీరన్న తెలిపారు. 15 మండలాల్లో 581 హ్యాబిటేషన్లలో తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉందన్నారు. ట్యాంకర్లు, వ్యవసాయ బోర్లు, సాధారణ బోర్లలో అదనపు పైపులు వేయడం ద్వారా తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు.
ప్రస్తుతం 188 హ్యాబిటేషన్లలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామని.. 21 వ్యవసాయ బోర్ల ద్వారా 20 గ్రామాలకు నీటిని అందిస్తున్నట్లు చెప్పారు. ఏ గ్రామంలో అయినా తాగునీటి సమస్యలు ఉంటే 08565-295017కు ఫోన్ చేయాలని సూచించారు. ఫోన్ చేసిన వెంటనే ఆయా ప్రాంతాల్లోని తమ శాఖ అధికారులను పంపించి ఆ సమస్యను పరిష్కరిస్తామన్నారు.
ఇవీ చదవండి: