ETV Bharat / state

అద్దె బస్సుల్లో డీజిల్​ అపహరించిన ఇద్దరు అరెస్ట్​ - jammalamadugu latest news

కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో ఇద్దరు డీజిల్ దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. అర్ధరాత్రి అద్దె బస్సుల్లో డీజిల్​ను దొంగలించి ఒక చోట ఉంచేవారు. అలా ఆరు బస్సుల్లో తీసిన 345 లీటర్ల డీజిల్ కొన్ని డ్రమ్ములో నింపి ఉంచారు. శుక్రవారం వాహనంలో తలిస్తుండగా ఇద్దరు నిందితులతో పాటు దొంగతనంగా తరలిస్తున్న డీజిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సైలు రంగారావు, రవికుమార్ తెలిపారు.

diesel theft from buses by two people caught by jammalamadugu police
జమ్మలమడుగు పట్టణంలో ఇద్దరు డీజిల్ దొంగలు అరెస్ట్​
author img

By

Published : Jul 18, 2020, 3:03 PM IST

కడప జిల్లా జమ్మలమడుగు ఆర్టీసీ బస్టాండు ఆవరణలో నిలిపి ఉన్న అద్దె బస్సుల్లో రాత్రి వేళల్లో డీజిల్​ తీసి విక్రయించే ముఠాను అరెస్ట్​ చేసినట్లు ఎస్సైలు రంగారావు, రవికుమార్​ తెలిపారు. ఈ నెల 11న రాత్రి జమ్మలమడుగు డిపో ఆవరణలో నిలిపి ఉన్న ఆరు అద్దె బస్సుల్లో నుంచి 345 లీటర్ల డీజిల్​ దొంగలించినట్లు చెప్పారు. ఈ నెల 16న బైపాస్​ రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా వాహనంలో ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తూ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా పట్టుకున్నట్లు చెప్పారు. వాహనంలో ఇద్దరు నిందితులు, ఆరు క్యాన్లలో డీజిల్​ ఉందన్నారు. అద్దె బస్సుల్లో నుంచి డీజిల్​ను అక్రమంగా తీస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. నిందితులను అరెస్ట్​ చేసి వాహనం, డీజిల్​ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి :

జమ్మలమడుగులో బాంబు కలకలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.