రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కడపలో పర్యటిస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితులుగా ఉన్న శ్రీనివాసులు రెడ్డి మంగళవారం ఆత్మహత్య చేసుకోవడంతో... కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ మేరకు డీజీపీ స్వయంగా రంగ ప్రవేశం చేశారు. పోలీస్ కార్యాలయంలో అధికారులతో సమావేశమై.. కేసుకు సంబంధించిన వివరాలు తెలుసుకుంటున్నారు. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
వివేకా ఇంటిని పరిశీలించిన డీజీపీ
పులివెందులలో ఉన్న వివేకానందరెడ్డి ఇంటిని డీజీపీ గౌతమ్ సవాంగ్ పరిశీలించారు. హత్యా జరిగిన స్థలాన్ని కూడా చూశారు. అధికారులను వివరాలడిగి తెలుసుకున్నారు.
ఇది కూడా చదవండి.