"డబ్బు ఈరోజు ఉంటుంది.. రేపు పోతుంది.. మనిషి నేర్చుకున్న విద్య శాశ్వతంగా ఉండిపోతుంది" అని.. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. అమ్మ ఒడి రెండో విడత ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కడప జిల్లా జమ్మలమడుగులోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థినులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు 36,290 మంది విద్యార్థులు ఉండగా.. 24,047 మంది అర్హత సాధించినట్లు పేర్కోన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు ఈ పథకం చాలా ఉపయోగపడుతుందని.. ఎమ్మెల్యే చెప్పారు.
ఇదీ చదవండి: