ETV Bharat / state

ప్రజలు స్వీయ నిర్బంధాన్ని పాటించాలి: ఉప ముఖ్యమంత్రి అంజాద్ - mla ravindranathreddy latest news

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి బయటికి రాకుండా స్వీయ నిర్బందాన్ని పాటించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్. బి.అంజాద్ బాషా కోరారు. బుద్ధ టౌన్ షిప్ వ్యవస్థాపకులు గుమ్మా రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కడప జిల్లాలోని శివానందపురంలో పేదలకు బియ్యం పంపిణీ చేశారు.

Deputy Chief Minister distributes rice
ఉపముఖ్యమంత్రి బియ్యం పంపిణీ
author img

By

Published : May 16, 2020, 8:42 AM IST

ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించడంతో కరోనాను కట్టడి చేయగలమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్. బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. శివానందపురంలో బుద్ధ టౌన్ షిప్ వ్యవస్థాపకులు గుమ్మా రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 300 మంది పేదలకు ఉచితంగా బియ్యం ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు హాజరయ్యారు.

ప్రజారోగ్య పరిరక్షణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని, కోవిడ్-19 వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ కు ప్రజలందరూ సహకరించాలని కోరారు. ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగానో కృషి చేస్తూన్నాయని చెప్పారు.

ఇవీ చూడండి:

ఈటీవీ భారత్ ఎఫెక్ట్: గుంజన ఏరు వంతెనకు మరమ్మతులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.