Degree Student Anusha Death Case: వైఎస్సార్ జిల్లా బద్వేల్‌కు చెందిన విద్యార్థిని అనూష మృతి కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. అనూష నీటిలో పడడం వల్ల మృతి చెందినట్లు వైద్యులు పోస్టుమార్టం నివేదిక ఇచ్చారన్నారు. కేసును పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని చెప్పారు. అనూష ఒంటరిగానే సిద్ధవటం కోట వైపు వెళ్లినట్లు ఎస్పీ తెలిపారు. ఒకవేళ కింది స్థాయి అధికారులు ఎవరైనా ఈ కేసును తారుమారు చేయాలనుకుంటే వారిపై చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు.
మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ డీసీ: డిగ్రీ విద్యార్థిని అనూష మృతి ఘటన కేసుకు సంబంధించి ఎంతటి పెద్దవారి ప్రమేయం ఉన్న దోషులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి , ఎమ్మెల్యే సుధా స్పష్టం చేశారు. ఈ కేసు త్వరగా దర్యాప్తు చేయించి దోషులకు శిక్ష పడేలా చూస్తామని అన్నారు. తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామని మృతురాలి కుటుంబానికి హామీ ఇచ్చారు.
ఇవీ చదవండి: