కడప జిల్లా ప్రొద్దుటూరులో ముగ్గురు క్రికెట్ బుకీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప, రాయచోటి, తిరుపతి ప్రాంతాల్లో క్రికెట్ బుకీగా ఉన్న చంద్రశేఖర్‌రెడ్డి (పూల చంద్ర) బెట్టింగ్ నిర్వహిస్తుంటాడని డీఎస్పీ సుధాకర్ చెప్పారు. అతనికి సహకరించే సుబ్బారాయుడు, సురేష్, నాగేంద్రలను జిన్నారోడ్డులోని ఓ కూల్‌డ్రింక్స్ షాపు వద్ద పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 2.68 లక్షల రూపాయల నగదు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న బెట్టింగ్ నిర్వాహకుడు చంద్రశేఖర్‌ను పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు.
ఇదీ చదవండి :