CPI Ramakrishna: ప్రతి అంశంపైనా కేసులను నమోదు చేసుకుంటూపోతే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ముఖ్యమంత్రి జగన్ వైఖరిలో మార్పు రావాలని ఆయన హితవు పలికారు. పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఉక్కు సాధన సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. వైఎస్సార్ జిల్లాలో ఉక్కు కర్మాగారం కోసం సీఎం జగన్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
నెల్లూరు కోర్టులో దొంగలు కేవలం కాకాణికి సంబంధించిన సామాగ్రి తీసుకువెళ్లడం వెనుక పెద్ద బాగోతం ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక హోదా అడగడం లేదు.. ప్రత్యేక ప్యాకేజీ కూడా అడగడం లేదని ఎద్దేవా చేశారు. ఉక్కు కర్మాగారం ఉద్యమం ఇంతటితో ఆగదని పెద్ద ఎత్తున ఆందోళనలు చేసి ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటామని చెప్పారు. ఇప్పటికే ముగ్గురు ముఖ్యమంత్రులు ఉక్కు కర్మాగారం కోసం భూమిపూజ చేశారని.. కానీ ఎవరూ ప్రారంభించలేదని ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: Family Suicide Attempt: వారికి ఏ కష్టమొచ్చిందో... పురుగుల మందు తాగేశారు..