ETV Bharat / state

కేంద్రానికి జగన్ రాసిన లేఖలో కడప శౌర్యం కనిపించలేదు: సీపీఐ నారాయణ - జగన్​పై సీపీఐ నారాయణ కామెంట్స్

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కాకుండా కాపాడాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్​ చేశారు. సీఎం కేంద్రానికి రాసిన లేఖలో కడప శౌర్యం ఎక్కడా కనిపించలేదని విమర్శించారు.

cpi narayana on vishaka steel plant
cpi narayana on vishaka steel plant
author img

By

Published : Feb 10, 2021, 10:25 PM IST

విశాఖలో వైకాపా మంత్రులు కార్మికులకు మద్దుతు తెలుపుతుంటే... సీఎం కూడా విజయవాడలో ఆందోళన చేపట్టాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ కోసం యువమోర్చా ఆధ్వర్యంలో గతంలో ఉద్యమం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు... ఇపుడు నోరు మెదపకుంటే ఆయన్ని తెలుగు ప్రజలు క్షమించరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కార్పొరేట్ కంపెనీలకు అప్పగించడానికి ప్రధాని నరేంద్రమోదీ ఇలాంటి జిమ్మిక్కులు చేస్తుంటారన్నారు. పార్లమెంటులో గులాంనబీ ఆజాద్ వీడ్కోలు సభలో ప్రధాని ముసలి కన్నీరు కార్చారు తప్పితే.. నిజంగా బాధపడలేదని వ్యాఖ్యానించారు. తెలంగాణలో షర్మిల రాజకీయ చర్చలు చేయడానికి జగన్ ప్రోత్సాహం తప్పకుండా ఉంటుందని నారాయణ అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలు: ఫిర్యాదులకు ఈ నెంబర్​కు ఫోన్ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.