ETV Bharat / state

వేంపల్లిలో కరోనా వ్యాప్తి.. అధికారుల ముందు జాగ్రత్త చర్యలు - corona outbreak in vempally news

కడప జిల్లా వేంపల్లిలో కరోనా కేసులు పెరుగుతుండడంపై ప్రజలు, అధికారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్​ ప్రభావిత ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. కొవిడ్​ ప్రత్యేక అధికారి ఇతర అధికారులతో కలిసి ఇక్కడ పర్యటించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. నిబంధనలు కచ్చితంగా పాటించాలని సూచించారు.

వేంపల్లి కంటైన్మెంట్​ ప్రాంతాల్లో ప్రత్యేక అధికారి పర్యటన

author img

By

Published : Jun 28, 2020, 5:19 PM IST

కడప జిల్లా వేంపల్లిలో ఒక్కసారిగా కరోనా కేసులు పెరగుతున్న ఆందోళనకర పరిస్థితులపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పాజిటివ్​ కేసులు వచ్చిన ప్రాంతాలను అధికారులు కంటైన్మెంట్​ జోన్​గా ప్రకటించారు. వేంపల్లి ప్రత్యేక అధికారి శాంతమ్మ, రెవెన్యూ, వైద్య, పోలీసు అధికారులతో కలిసి ఇక్కడ పర్యటించారు. ఇకపై వేంపల్లిలో ఆంక్షలు కఠినతరం చేస్తామని అధికారులు తెలిపారు.

ప్రజలు నిబంధనలు పాటించాలని.. బయటకు వస్తే తప్పకుండా భౌతిక దూరం పాటిస్తూ.. మాస్కులు ధరించాలని స్పష్టం చేశారు. దుకాణాల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే జరిమానా విధిస్తామని అధికారులు తెలిపారు. తిరిగి లాక్​డౌన్​ పరిస్థితి రాకుండా సహకరించాలన్నారు.

ఇదీ చూడండి:

కడపలో కరోనా కలవరం... భారీగా పాజిటివ్ కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.