కడప జిల్లా రాజంపేటలోని కూరగాయల మార్కెట్ లోపల కాకుండా బయట ప్రాంతంలో.. వ్యాపారులు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ కారణంగా ఆ ప్రాంతం నిత్యం రద్దీగా మారుతోంది. మరోవైపు మార్కెట్కు వచ్చే ప్రజలు కొందరు కరోనా నిబంధనలను గాలికి వదిలేస్తున్నారు. కనీసం, సామాజిక దూరం, మాస్క్ వంటి కనీస నియమాలను పాటించటం లేదు. వ్యాపారులు కూడా ఇదే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈ కారణంగా కొవిడ్ తీవ్రత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఎవరు ఎన్ని చెప్పినా ప్రజల్లో మార్పు వస్తేనే కరోనా కట్టడి సాధ్యమవుతుంది.
ప్రజల నిర్లక్ష్యం.. కనిపించని కరోనా నిబంధనలు - rajayampeta updates
కరోనా రెండోదశ ఎంతో మంది ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది. అప్తులు కూడా చివరి చూపుకు నోచుకొలేని పరిస్థితి నేడు నెలకొంది. కానీ ఇవేవీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు కొందరు. సామాజిక దూరం, మాస్క్ వంటి కనీస నియమాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.