ETV Bharat / state

పోలీసులకు ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్

author img

By

Published : May 18, 2021, 7:59 AM IST

పోలీసుల సంక్షేమం కోసం కడప నగరంలో ఏర్పాటు చేసిన కొవిడ్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్​ను జిల్లా ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందించేందుకు వసతులను కల్పించినట్లు చెప్పారు.

covid care center
కొవిడ్​ కేర్​ సెంటర్​ను పరిశీలిస్తున్న ఎస్పీ

కరోనా సెకండ్​ వేవ్​ విజృంబిస్తున్న తరుణంలో కొవిడ్​ బారిన పడిన పోలీసులకు చికిత్స అందించేందుకు ఏర్పాటు చేసిన కొవిడ్ ఎమర్జెన్సీ కేర్ సెంటర్​ను ఎస్పీ అన్బురాజన్ పరిశీలించారు. కడప నగరంలోని పోలీస్ ఆఫీసర్స్ రెస్ట్ హౌస్​లో 15 బెడ్లు, 20 ఆక్సిజన్ సిలిండర్లు, అత్యాధునిక వెంటిలేటర్ సదుపాయాలతో కొవిడ్​ కేర్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

కరోనా బారిన పడిన పోలీసు సిబ్బందికి, వారి కుటుంబసభ్యులకు అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలతో ఈ వసతులు కల్పించినట్టు ఎస్పీ చెప్పారు. నిపుణులైన వైద్యులు 24 గంటలు.. బాధితులను పర్యవేక్షిస్తుంటారని తెలిపారు. చికిత్సకు అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా ఎస్పీ చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ వెంట ఫ్యాక్షన్ జోన్ డీఎస్పీ చెంచుబాబు, పోలీస్​ వేల్పేర్ హాస్పిటల్ డా.సమీరా బాను, ఆర్​ఐ మధు ఉన్నారు.

ఇదీ చదవండి:

'కరోనా బాధితులకు సకాలంలో ఆక్సిజన్‌ అందేలా పోలీసుల కృషి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.