ETV Bharat / state

ప్రొద్దుటూరులో మ‌రో 6 కరోనా కేసులు - క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా మరణాలు

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో క‌రోనా విజృంభిస్తోంది. పట్టణంలో మ‌రో 6 కేసులు న‌మోద‌య్యాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.

Corona Positive Cases increases in Proddutur
క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో కరోనా పాజిటివ్
author img

By

Published : Jun 11, 2020, 12:22 PM IST

క‌డ‌ప జిల్లా ప్రొద్దుటూరులో క‌రోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పట్టణంలో మరో 6 కేసులు న‌మోద‌య్యాయి. కోనేటి కాల్వ వీధిలో ఓ బాలుడికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప‌వ‌ర్‌హౌస్ రోడ్డులో ఇద్ద‌రు చిన్నారుల‌తో స‌హా త‌ల్లికి.. క‌రోనా వైర‌స్ సోకింది. న‌డింప‌ల్లెలోని భార్యభ‌ర్త‌ల‌కు పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రొద్దుటూరులో మొత్తం కేసుల సంఖ్య 58కి చేరగా...అందులో 41 మంది కోలుకున్నారు. మిగిలిన 17 మంది చికిత్స పొందుతున్నారు. క‌రోనా వైర‌స్ కేసులు త‌గ్గుతున్నాయ‌న్న ధైర్యంతో ఉన్న ప్ర‌జ‌లు.. ఒక్క‌సారిగా 6 కేసులు న‌మోద‌వ్వ‌డంతో భ‌యందోళ‌న చెందుతున్నారు. క‌రోనా సోకిన వారికి స‌న్నిహితంగా ఉన్న 19 మందిని ప‌రీక్ష‌ల కోసం ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

ఇదీ చూడండి. కరోనా కష్టాలు: రైతుల వేదన.. మూగజీవుల రోదన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.