కరోనా బాధితుడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందిన ఘటన కడప జిల్లా అట్లూరులో చోటు చేసుకుంది. బద్వేల్ నుంచి అంబులెన్సులో తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి మృతదేహాన్ని దించేశారు.
అనంతరం డ్రైవర్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అట్లూరు ఠాణాకు సమాచారం అందించారు. ఎస్సై శ్రీకాంత్ వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రైవేట్ వాహనంలో మృత దేహాన్ని స్వగ్రామానికి పంపించారు. మృతుడు బద్వేల్లోని సురేంద్ర నగర్‌కు చెందిన జోగేశ్వర్గా పోలీసులు గుర్తించారు.
ఇవీ చూడండి : రాష్ట్రంలో ఈ నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు