కడప జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం కొత్తగా 54 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 840కి చేరింది. తాజా కేసుల్లో కడప-20, మైలవరం-2, మైదుకూరు-3, ఎర్రగుంట్ల-2, ప్రొద్దుటూరు-4, వేముల-3, ముద్దనూరు-10, అట్లూరు, రాజంపేట, పెండ్లిమర్రి, కొండాపురం ప్రాంతాల్లో ఒక్కొక్క కేసు చొప్పున నమోదయ్యాయి.
విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన ఆరుగురికి కరోనా సోకిందని వైద్యఆరోగ్యశాఖ ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు 333 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ప్రొద్దుటూరు కొవిడ్ ఆసుపత్రిలో పాజిటివ్ వచ్చిన ఓ మహిళ శనివారం మృతిచెందారు. ఆమె దీర్ఘకాలంగా క్షయ వ్యాధితో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఇప్పటివరకు జిల్లాలో నిర్వహించిన కరోనా పరీక్షలు 66 వేలు దాటాయి. 62 వేల ఫలితాలు రాగా... ఇంకా 3,700 నివేదికలు రావాల్సి ఉంది. కువైట్ నుంచి వచ్చిన 133 మందికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. వైరస్ వ్యాప్తి తీవ్రమవుతున్న తరుణంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి...