కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఉప్పలపాడుకు చెందిన ఓ గుత్తేదారుడు గ్రామస్థుల వద్ద సుమారు రూ.10 కోట్లు అప్పు చేసి పరారయ్యాడు. గత 10 రోజులుగా కాంట్రాక్టర్ ఊర్లో కనిపించడం లేదంటూ గ్రామస్థులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ కూడా కలవడం లేదని డీఎస్పీ నాగరాజుకు వివరించారు.
కాంట్రాక్టర్ శనగల వ్యాపారం సైతం చేస్తుంటాడని.. గ్రామస్థులు తెలిపారు. సక్రమంగా అప్పు చెల్లిస్తాడనే నమ్మకంతో అతనికి డబ్బిచ్చామని.. ప్రామిసరీ నోట్లు సైతం రాయించుకున్నామని పేర్కొన్నారు. బిల్లులు పెండింగ్లో ఉన్నాయని.. అవి రాగానే అప్పు తీర్చేస్తానంటూ కాంట్రాక్టర్ ఇన్నాళ్లూ తమను మభ్య పెట్టాడని వాపోయారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి..