వైకాపా చేస్తున్న అరాచకాలు, దౌర్జన్యాలను కట్టడి చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు, అమరావతి పరిరక్షణ కమిటీ మహిళ ఐకాస చైర్మన్ సుంకర పద్మశ్రీ అన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం గురించి ఏం మాట్లాడిన కడప నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. అయినప్పటికి ఏమాత్రం భయపడకుండా ముందుకు వెళ్తున్నామన్నారు. మహిళలను, రైతులను కంటనీరు పెట్టించిన ఏ ప్రభుత్వం బతికి బట్టకట్టలేదని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏనాడు మహిళలను, రైతులను బాధ పెట్టలేదని గుర్తు చేశారు. అన్నం పెట్టే రైతన్నకు బేడీలు వేసిన ఘనత జగన్మోహన్రెడ్డికి దక్కిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో మోదీ, జగన్‌లకు ట్రంపునకు పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. త్వరలోనే జగన్ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతారని ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ అండగా ఉంటుందని ఆమె భరోసా ఇచ్చారు.
ఇవీ చూడండి...