Congress leader Tulsi Reddy: దేశంలోని అత్యంత సంపన్నులైన సీఎంలు, అత్యల్ప ఆదాయం కలిగిన సీఎంల వివరాలను ఇటివలే ఏడీఆర్ అనే సంస్థ విడుదల చేసింది. ఆ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం ఏపీ సీఎం జగన్ దేశంలోనే అత్యంత సంపన్నుడైన సీఎంలలో మెుదటి స్థానంలో నిలిచాడు. వివిధ రాష్ట్రాల సీఎంలను వెనక్కి నెడుతూ... మెుదటి స్థానంలో నిలవడంపై కాంగ్రెస్ నేత స్పందించారు.
ధనికులకు, పేదలకు మధ్య యుద్ధం: 30 మంది ముఖ్యమంత్రిలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అత్యంత ధనవంతుడని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఏపీ కాంగ్రెస్ మీడియా వ్యవహరాల ఛైర్మన్ తులసిరెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి జగన్, అబద్ధాలు కవల పిల్లలు అని తులసి రెడ్డి ఎద్దేవా చేశారు.. కడప జిల్లా వేంపల్లిలో తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అబద్ధాలు చెప్పడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి పరిపాటి మారిందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ధనికులకు, పేదలకు మధ్య యుద్ధం జరగబోతోందని తులసిరెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ తాను పేదవాడినని, పేదల పక్షాన ఉంటానని.. తనకు ఆర్థిక బలం, అంగబలం, మీడియా బలం లేదని జగన్ బహిరంగ సభలో చెప్పాడని తులసి రెడ్డి అన్నారు. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులలో అత్యంత సంపన్నుడు జగన్మోహన్ రెడ్డి, అత్యంత పేదరాలు మమత బెనర్జీ అని ఏడీఆర్ నివేదిక స్పష్టం చేసిందని తెలిపారు.
జగన్ ఆస్తి విలువ 510 కోట్లు: 2019 ఎన్నికల అఫిడవిట్ వివరాల ఆధారంగా జగన్ ఆస్తి విలువ రూ.510 కోట్లు ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నట్లు తులసిరెడ్డి తెలిపారు. తనకు మీడియా బలం లేదని, ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సాక్షి దిపత్రిక, సాక్షి టివి జగన్‌వి అని అందరికీ తెలుసునని అన్నారు. ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానుకోవాలని తులసి రెడ్డి హితలవు పలికారు.
'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, అబద్ధాలు ఇద్దరు కవలపిల్లలు అనే అనుమానం కలుగుతుంది. జగన్ కు ఉదయం లేస్తే అబద్ధాలు చెప్పడం పరిపాటిగా మారిపోయింది. ఇటివల ఎడీఆర్ అనే సంస్థ దేశంలో ఉండే ముఖ్యమంత్రులు ఎన్నికల అపిడవిట్ వివరాల ప్రకారం ధనిక సీఎం వివరాలు తెలిపింది. అందులో సీఎం జగన్ ఆస్తి 510 కోట్లు అని వెల్లడించింది. మిగితా అందరి ఆస్తి కలిపినా జగన్ ఆస్తితో సరిపోవడం లేదు. జగన్ ఇకనైనా అబద్ధాలు మానుకోవాలి .'- తులసిరెడ్డి, కాంగ్రెస్ నేత
ఇవీ చదవండి: