రాష్ట్రం రౌడీల రాజ్యమైందని, శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తులసీ రెడ్డి విమర్శించారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు పెరిగిపోయాయన్న ఆయన.. చివరకు ప్రతిపక్ష నేత కాన్వాయ్‌పైనా రాళ్లదాడి చేశారని దుయ్యబట్టారు. కడప జిల్లా వేంపల్లిలోని స్వగృహంలో మాట్లాడిన ఆయన.. కొందరు మంత్రుల భాష దారుణంగా ఉందని ఆక్షేపించారు. ప్రజల్లో తిరుగుబాటు రాకముందే అమాత్యులను అదుపులో పెట్టాలని.. సీఎం జగన్కు తులసీరెడ్డి సూచించారు.
ఇదీ చూడండి: