నిత్యావసర వస్తువుల ధరలు, ఆస్తి పన్నులు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంకణం కట్టుకున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో పెంచిన ఆస్తి పన్నును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ వద్ద డీసీసీ అధ్యక్షుడు నీలి శ్రీనివాసరావు చేపట్టిన ఒక రోజు నిరాహారదీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రో ధరలు పెంచి సామాన్య, మధ్య తరగతి ప్రజల జీవనం ప్రశ్నార్థకం చేస్తోందని తులసిరెడ్డి విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం చెత్త పన్ను, ఆస్తి పన్ను అంటూ వివిధ రకాల జీవోలతో ప్రజలపై పన్నుల భారం మోపిందన్నారు. కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఇబ్బందులు పెట్టడానికి పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రజలపై భారం మోపడమే లక్ష్యంగా రెండు ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 196, 197, 198 జీవోలను వెంటనే ఉప సంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
Corona cases: కరోనా చికిత్సపై దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టులో విచారణ