అఖిల భారత రైతు సంఘాల కార్యాచరణ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 8వ తేదీన చేపట్టిన భారత్ బంద్కు.. కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి చెప్పారు. రైతులకు నష్టం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాలను అనేక పార్టీలు, సంఘాలు వ్యతిరేకిస్తున్నాయన్నారు.
రాష్ట్రంలో పార్టీలు మాత్రం రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు ఇవ్వడం దురదృష్టకరమని చెప్పారు. రైతులకు మేలు చేస్తున్నామని చెబుతూ మరోపక్క లోక్సభలో, రాజ్యసభలో బేషరతుగా మద్దతు తెలుపుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోని 3 పార్టీలు భాజపాకు కబాలి పార్టీలుగా మారాయన్నారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: