ETV Bharat / state

ఈ కండక్టర్ నిజాయతీపరుడు... ఎందుకో తెలుసా..? - ఆర్టీసీ కండక్టర్ నిజాయతి వార్తలు

కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా పని చేస్తున్న రామచంద్రయ్య నిజాయతీని చాటుకున్నాడు. ప్రయాణికులు బస్సులో మర్చిపోయిన వస్తువులను బాధ్యతతో అధికారులకు అప్పగించాడు.

rajampeta conductor handovers passengers forgotten things to higher authorities
నిజాయితీ చాటుకున్న రాజంపేట ఆర్టీసీ కండక్టర్
author img

By

Published : Mar 20, 2020, 11:28 PM IST

ఈ కండక్టర్ నిజాయతీపరుడు... ఎందుకో తెలుసా..?

కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్​గా పని చేస్తున్న రామచంద్రయ్య తన నిజాయతీని చాటుకున్నాడు. రాజంపేట నుంచి రాయచోటికి వెళ్తున్న బస్సులో ఓ యువకుడు తన బ్యాగ్​ను మరిచిపోయి మధ్యలోనే దిగాడు. గమనించిన కండక్టర్ బ్యాగును డిపో మేనేజర్ బాలాజీకి అందజేశారు. గతంలో కూడా బద్వేలు డిపోలో విధులు నిర్వహిస్తున్న సమయంలో బంగారు గాజులు దొరకగా ఆర్టీసీ అధికారులకు అందజేసినట్లు డీఎం తెలిపారు. ఆర్టీసీలో ప్రతి కండక్టర్ నిజాయతీగా వ్యవహరిస్తూ ప్రయాణికులు పోగొట్టుకున్న వస్తువులను తిరిగి బాధితులకు అందించాలని సూచించారు.

ఇదీ చదవండి: రాజంపేటలో పది విద్యార్థుల వీడ్కోలు సభ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.