కడప జిల్లాలో 2020 -21 ఆర్థిక సంవత్సరానికి రూ.12,950 కోట్ల అంచనాతో రుణ ప్రణాళికను ఆమోదించామని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. కలెక్టరేట్లోని స్పందన హాల్లో సోమవారం అధికారులు, బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.
కోవిడ్-19 కారణంగా కుదేలైన రంగాలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలను ప్రకటించాయని వాటిని అమలు చేయడానికి బ్యాంకులు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఆమోదించిన రుణ ప్రణాళిక గత సంవత్సర రుణ ప్రణాళిక కంటే 16.89 శాతం ఎక్కువ అని చెప్పారు.
ఇవీ చూడండి: