ETV Bharat / state

రోడ్డు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేయండి

author img

By

Published : Jul 17, 2020, 5:58 PM IST

కడప నగర అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా రహదారుల విస్తరణకు ప్రణాళికలు వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్​ ఆదేశాలిచ్చారు. రైల్వేస్టేషన్​ రోడ్డు, రిమ్స్​కు వెళ్లే రహదారులను జాయింట్​ కలెక్టర్​తో కలిసి పరిశీలించారు.

collector looking to extension roads in railway station and rims area
నగరంలో రహదారుల విస్తరణకు ప్రణాళికలు

కడప నగరంలో రహదారుల విస్తరణకు ప్రణాళికలు వేగవంతం చేయాలని రెవెన్యూ, నగరపాలిక అధికారులకు కలెక్టర్​ హరికిరణ్​ ఆదేశాలు జారీ చేశారు. గురువారం నగరంలోని రైల్వేస్టేషన్​ రోడ్డు, రిమ్స్​కు వెళ్లే రహదారులను జాయింట్​ కలెక్టర్​ ( అభివృద్ధి) సాయికాంత్​ వర్మతో కలిసి పరిశీలించారు. నగర అభివృద్ధి, సుందరీకరణ పనుల్లో భాగంగా రైల్వే స్టేషన్​ నుంచి రిమ్స్​ మార్గంలోని రైల్వే వంతెన వరకు 90 అడుగుల వెడల్పుతో నూతన రోడ్డును రూ. 15 కోట్ల నిధులతో చేస్తున్నామని కలెక్టర్​ తెలిపారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు, ఆక్రమిత స్థలాలను, కట్టడాలను వెంటనే గుర్తించాలన్నారు. ఆర్డీవో మలోల, నగరపాలక కమిషనర్​ లవన్న, కడప తహసీల్దారు శివరామిరెడ్డి, సీకేదిన్నె తహసీల్దార్​ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

ఇదీ చదవండి :

కువైట్ నుంచి రాజంపేటకు 195 మంది రాక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.