TELANGANA GOVT STUDY ON POLAVARAM: తెలంగాణ రాష్ట్రంపై పోలవరం ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో అధ్యయనానికి తెలంగాణ సీఎం ఆదేశించారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని అన్నారు. ఐఐటీ హైదరాబాద్ బృందంతో సమన్వయానికి ప్రత్యేకాధికారిని నియమించాలని ఆదేశాలలో పేర్కొన్నారు. భద్రాచలం ఆలయానికి ఏర్పడే ముప్పుపై ఈ బృందం అధ్యయనం చేయనుంది.
రేవంత్ రెడ్డి అధ్యక్షతన నీటిపారుదల శాఖ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అధికారులను సీఎంకి పలు కీలక విషయాలను తెలిపారు. 2022లో వచ్చిన వరదలకు భద్రాచలం ముంపునకు గురైందని అధికారులు పేర్కొన్నారు. 2022లో 27 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్న తెలంగాణ అధికారులు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్టును సైతం చేపడుతోందని తెలిపారు. అయితే బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు లేవని తెలంగాణ అధికారులు రేవంత్ రెడ్డితో తెలిపారు. తెలంగాణ అభ్యంతరాలను ఏపీ సీఎస్‌కు తెలపాలని రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. అవసరమైతే గోదావరి బోర్డు, కేంద్ర జలశక్తి శాఖకు లేఖలు రాయాలని రేవంత్ సూచించారు.
2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామన్న మంత్రి నిమ్మల - సీఎం ఏమన్నారంటే!