Monkeys in Chinnamusturu School : నిత్యం కోతుల బెడదతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. స్కూల్కు వెళ్లాలంటే భయమేస్తుందని అంటున్నారు. ఈ కోతుల బెడద అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం చిన్న ముష్టూరులోని ఆదర్శ పాఠశాలలో చోటు చేసుకుంది. ప్రతిరోజు కోతులు వస్తుండటం వల్ల ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు.
తరగతి గదిలోకి కూడా కోతులు వస్తున్నాయని, దీంతో తాము భయాందోళనకు గురువుతున్నామన్నారు. తెచ్చుకుంటున్న తినుబండారాలను సైతం ఎత్తుకెళ్తున్నాయని విద్యార్థులు వెల్లడించారు. చాలా రోజులుగా కోతులు ఇబ్బందులకు గురి చేస్తున్నా విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి పాఠశాల సమీపంలో ఉన్న కోతులను దూర ప్రాంతాలకు తరలించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.
రెండున్నర కేజీల పాము విషం.. ఫ్రాన్స్ నుంచి చైనాకు స్మగ్లింగ్.. విలువ రూ.30 కోట్లు