వచ్చే నెల 1, 2 తేదీల్లో కడప జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. సెప్టెంబరు 2న వైఎస్ వర్ధంతి సందర్భంగా సీఎం ఇడుపులపాయ వెళ్లనున్నారు. సెప్టెంబరు 1న మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప వెళ్లనున్న సీఎం.. అక్కడినుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయ చేరుకోనున్నారు. ఆరోజు రాత్రి ఇడుపులపాయ ఎస్టేట్లో సీఎం జగన్ బస చేస్తారు. సెప్టెంబరు 2న ఉదయం వైఎస్ ఘాట్ వద్ద నివాళి అర్పించి తిరుగు ప్రయాణం కానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఉత్తరభారత పర్యటనలో సీఎం..
ముఖ్యమంత్రి జగన్ ప్రస్తుతం ఉత్తర భారత పర్యటనలో ఉన్నారు. ఈనెల 28న ముఖ్యమంత్రి జగన్ వివాహం జరిగి 25 ఏళ్లు పూర్తయ్యాయి. సందర్భంగా ఆయన కుటుంబంతో కలిసి ఈనెల 26 నుంచి వ్యక్తిగత పర్యటనకు వెళ్లారు. పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి..రేపు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి