కడప జిల్లా పులివెందుల పట్టణంలోని చెన్నారెడ్డి కాలనీలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లింగాల మండలానికి చెందిన రమణారెడ్డికి... వేముల గ్రామానికి చెందిన శ్రీనాథ్‌రెడ్డి లక్షా 20 వేలు బాకీ ఉన్నాడు. తనకు ఇవ్వాల్సిన నగదు చెల్లించాలి అంటూ శ్రీనాథ్ రెడ్డిని రమణారెడ్డి అడగ్గా... శ్రీనాథ్ రెడ్డి, గుట్ట మధు, రామ్మోహన్, గంగాధర భరత్ అనే వ్యక్తులు దాడి చేశారు. బాధితుడు రమణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 307 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పులివెందుల అర్బన్ సీఐ సీతారామి రెడ్డి తెలిపారు.
ఇదీ చదవండీ...'రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలు సరైనవే'