తల్లి ఒడిలో ఉండాల్సిన శిశువు కంపచెట్లలో దర్శనమిచ్చాడు. అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు కంపచెట్లలో పడేసి వెళ్లారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పరిధిలోని గోపవరం పంచాయతీ యానాదికాలనీలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది.
కాసేపటికి శిశువు ఏడుపును గుర్తించిన ఓ మహిళ.. పసికూనను చేరదీసింది. సోమవారం ఉదయమే పోలీసులకు సమాచారమిచ్చింది. శిశువును ఆస్పత్రికి తరలించిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్యంగానే ఉన్నట్టు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: