ETV Bharat / state

CHIEF ELECTORAL OFFICER VIJAYANAND: 'ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకూడదు..'

బద్వేలు ఉపఎన్నికల ప్రచారాల్లో ఐదుగురికి మించి వెళ్లకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ వెల్లడించారు. అలాగే వాలంటీర్లు కూడా ప్రచారాల్లో పాల్గొనకూడదని తెలిపారు.

chief-electoral-officer-vijayanand-said-that-volunteers-should-not-be-involved-in-the-election-process
'ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్లు పాల్గొనకూడదు..'
author img

By

Published : Oct 2, 2021, 7:03 AM IST

ఇంటింటి ఎన్నికల ప్రచారానికి ఐదుగురికి మించి వెళ్లకూడదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ వెల్లడించారు. కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల చేసిన సందర్భంగా శుక్రవారం సచివాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వీల్లేదు. నియోజకవర్గంలో 80 ఏళ్లు దాటిన 3,837 మందికి, దివ్యాంగులకు కూడా పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యాన్ని కల్పించాం.

కొవిడ్‌ సోకిన వారూ ఈ సౌకర్యాన్ని పొందొచ్చు. 272 కేంద్రాల్లో 30 కేంద్రాలు సున్నితమైనవిగా గుర్తించాం. కొవిడ్‌ నిబంధనల అమల్లో భాగంగా ప్రచారంలో ద్విచక్ర వాహన, ఇతర ర్యాలీలు నిర్వహించకూడదు. నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితోపాటు ఒక్కరే వెళ్లాలి. బహిరంగ ప్రదేశాల్లో జరిగే సమావేశాల్లో వెయ్యి మందికి మించి, వీధులు, కాలనీల్లో నిర్వహించే సమావేశాల్లో 50 మందికి మించి హాజరుకాకూడదు. తిరుపతి ఉప ఎన్నికల సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించి 6 పోలింగ్‌ కేంద్రాల పరిధిలో 20 కేసులు నమోదుచేశాం’’ అని వివరించారు.

ఇదీ చూడండి: Jagananna Swachha Sankalpam: బెజవాడలో 'జగనన్న స్వచ్ఛ సంకల్పం'.. ట్రాఫిక్ ఆంక్ష‌లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.