కడప జిల్లా రాయచోటిలో ఎమ్మెల్సీకి ఓ మోసగాడు టోకరా వేయబోయాడు. మంగళవారం రాయచోటిలో ఉన్న ఎమ్మెల్సీ జకియా ఖానమ్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తన పేరు బాబు జగ్జీవన్‌రావ్ అని, సీఎం ఆఫీసులో ప్రాజెక్టు డైరెక్టరుగా పని చేస్తున్నానంటూ నమ్మబలికాడు. రూ. 50 వేల నగదు డిపాజిట్ చేస్తే మీకు ప్రభుత్వం 25 లక్షల రుణమిస్తుందని చెప్పాడు. డబ్బును జమ చేసేందుకు తెలంగాణలోని జగ్గారెడ్డిగూడెం బ్యాంక్ అకౌంట్ నంబర్‌ను పంపించాడు.
ఆ వ్యక్తిపై అనుమానం రావడంతో జకియా ఖానం వెంటనే ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన స్పందించి సీఎం కార్యాలయంలో దీనిపై ఆరా తీశారు. అక్కడ అలాంటి వారెవరూ లేరనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ జకియా ఖానమ్.. నిందితుడిపై ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి అర్బన్ సీఐ రాజు వివరించారు.
ఇదీ చదవండి: