ETV Bharat / state

'వైకాపా బాధితుల కష్టాలు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతాం' - చంద్రబాబు కడప టూర్ వార్తలు

వైకాపా అరాచకాలకు అంతం పలికే రోజు త్వరలోనే వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు హెచ్చరించారు. సీఎం ప్రోద్బలంతో గోడలు కట్టడం, గోతులు తీయడం లాంటి ఉన్మాద చర్యలతో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు. నిరుపేదలు, అభాగ్యులపై ప్రతాపమేంటని నిలదీశారు. కావాల్సిన వారికే పథకాలు, పనులు అన్న రీతిలో వైకాపా పాలన సాగుతోందని దుయ్యబట్టారు.

chandrababu fires on ycp govt
'వైకాపా బాధితుల కష్టాలు తెదేపా మ్యానిఫెస్టోలో పెడతాం'
author img

By

Published : Nov 27, 2019, 6:17 AM IST

'వైకాపా బాధితుల కష్టాలు తెదేపా మ్యానిఫెస్టోలో పెడతాం'

కడప జిల్లా పర్యటనలో భాగంగా తెదేపా అధినేత చంద్రబాబు రెండో రోజు వైకాపా బాధితుల కష్టాలు విని చలించిపోయారు. పార్టీ మారకుంటే కేసులు పెడతామనే బెదిరింపులు సహా దాడులకు పాల్పడుతున్నారని పలువురు చంద్రబాబు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పులివెందులకు చెందిన ఓ బాధితుడు ఇంటికి అడ్డంగా గోడ కట్టారని వాపోయాడు. పోలీసులు సైతం వారికే సహకరించారని తెలిపాడు. పార్టీ మారలేదని దాడి చేశారని ఓ వృద్ధుడు కంటతడి పెట్టగా ఓదార్చిన చంద్రబాబు... 50 వేల రూపాయలు ఆర్థిక సాయం చేశారు. వైకాపాకు ఓటేయలేదని పత్తిపంట ధ్వంసం చేశారని, అట్రాసిటీ కేసు పెట్టారని ఇలా పలువురు పార్టీ అధినేత వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.

సీఎం ఏం చేస్తున్నారు ?

తన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యాలు జరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్ ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు. వైకాపా బాధితుల కష్టాలను తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెడతామని హామీ ఇచ్చారు.

నియోజకవర్గాల సమీక్ష

వైకాపా బాధితులతో సమావేశం ముగిసిన తర్వాత మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు జిల్లాలోని కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, మైదుకూరు, కడప నియోజకవర్గాల కార్యకర్తలతో చంద్రబాబు సమీక్షించారు. ఎన్నికల్లో పార్టీ వైఫల్యంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఉదయం మీడియా సమావేశం తర్వాత చంద్రబాబు అమరావతి బయల్దేరి వెళ్లనున్నారు.

ఇదీ చదవండి :

'ఏం చేశారని కడప జిల్లాలో పర్యటిస్తున్నారు..?'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.