నివర్ తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టంపై అంచనాలు వేసే కేంద్ర అధ్యయన బృందం కడప జిల్లాలో పర్యటిస్తుంది. రాజంపేట మండలం హేమాద్రివారి పల్లెలో తుపానుతో కోతకు గురైన, ఇసుక మేటలు వేసిన భూములను పరిశీలించారు. జరిగిన నష్టాన్ని కేంద్ర బృందానికి జిల్లా కలెక్టర్ హరి కిరణ్ వివరించారు. అధ్యయన బృందం అధికారులు రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా జరిగిన పంట నష్టాన్ని రైతులు తెలిపారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విన్నవించారు.
కోతకు గురైన భూములు పరిశీలిస్తున్న కేంద్ర బృందం - పంట నష్టాన్ని అంచనా వేస్తున్న కేంద్రం బృందం
నివర్ తుపాను పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందం కడప జిల్లాలో పర్యటిస్తోంది. రాజంపేట మండలం హేమాద్రి వారిపల్లెలో ఇసుక మేటలు, కోతకు గురైన భూములను బృందం సభ్యులు పరిశీలించారు.
ఇసుక మేటలు, కోతకు గురైన భూములను పరిశీలిస్తున్న కేంద్ర బృందం