ఎన్నో ఏళ్ల నుంచి రాజంపేట రైల్వే స్టేషన్కి చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఈ శ్మశాన వాటికను ఉపయోగించుకుంటున్నారు. సుమారు 1.72 ఎకరాల స్థలాన్ని అప్పట్లో ప్రభుత్వం దీనిని కేటాయించింది. దీన్ని స్థానిక ప్రజలు ఆక్రమణకు గురికాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు ఎన్నికల హడావిడిలో ఉన్నారు. మరోవైపు ప్రజలు కూడా ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఇదే అదునుగా చూసుకుని కొందరు వ్యక్తులు శ్మశాననానికి వెనక వైపున ఉన్న భాగాన్ని చదును చేశారు. చివరకు ప్రభుత్వం వేసిన సర్వే రాళ్లను కూడా వారు తొలగించారు.
ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు ఆందోళనకు చేపట్టారు. అధికారులు తక్షణమే దీనిపై స్పందించి శ్మశాన వాటిక ప్రాంతాన్ని రీసర్వే చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే గ్రామస్థులందరం కలిసి ఆందోళన చేస్తామని హెచ్చరించారు. చివరకు స్మశానాన్ని కూడా వదలక పోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రాయలసీమ తాప విద్యుదుత్పత్తి కేంద్రంలో తప్పిన పెనుప్రమాదం