మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య ( (YS Vivekananda Reddy Case News)) కేసులో సీబీఐ (CBI Investigation In YS Vivekananda Reddy Case) విచారణ కొనసాగుతోంది. కడప కేంద్రకారాగరం అతిథి గృహంలో 116వ రోజు విచారణ సాగుతోంది. వివేకా హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్(Sunil Yadav news) దగ్గరి బంధువు భరత్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. సునీల్‌కు భరత్ కుమార్ యాదవ్ మధ్య ఆర్థిక లావాదేవీలు సాగినట్లు సీబీఐ(cbi) అనుమానిస్తోంది. ఇప్పటికే భరత్‌ను పలుమార్లు సీబీఐ ప్రశ్నించింది. ఇతనితో పాటు ఓ ప్రముఖ టీవీ ఛానల్ ప్రతినిధిని కూడా సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజు గుండెపోటుగా టీవీలో ప్రసారం అయిన అంశాలు.. వాటికి సంబంధించిన వివరాలు, ఫుటేజీ పరిశీలించి ప్రశ్నించినట్లు సమాచారం.
ఇదీ చదవండి: Warangal rape case: అత్యాచారం కేసు.. తెరాస కార్పొరేటర్ భర్త అరెస్టు