ETV Bharat / state

Viveka Murder Case: సునీల్ యాదవ్ కుటుంబం కోసం అనంతకు..! - వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ ముమ్మరం వార్తలు

వైఎస్‌ వివేకా హత్యకేసులో 52వ రోజు సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ కుటుంబం హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో.. వారిని మరోసారి విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే.. సునీల్ కుటుంబం 15 రోజులుగా పులివెందులలో కనిపించకపోవటం.. చర్చనీయాంశంగా మారింది.

cbi investigation over ys viveka murder case
సునీల్ యాదవ్ కుటుంబం కోసం అనంతకు..!
author img

By

Published : Jul 28, 2021, 10:36 PM IST

మాజీమంత్రి వైఎస్.వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ 52వ రోజు చేపట్టారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ కుటుంబం హైకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో.. వారిని మరోసారి విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కానీ 15రోజుల క్రితం సునీల్ యాదవ్ కుటుంబం.. పులివెందుల నుంచి వెళ్లిపోయారు. సునీల్ యాదవ్, అతని భార్య, సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్, తల్లిదండ్రులు కృష్ణయ్య, సావిత్రిలను సీబీఐ అధికారులు గతంలో పలుమార్లు ప్రశ్నించారు. విచారణ పేరుతో వేధిస్తూ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారని.. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో 15 రోజుల నుంచి వారి కుటుంబం పులివెందులలో కనిపించక పోవడంపై చర్చనీయాంశంగా మారింది.

హైకోర్టులో పిటిషన్ వేసి సునీల్ కుటుంబం.. కోర్టు ఆదేశాలు వచ్చే వరకు పులివెందులకు రాకుండా జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. బుధవారం.. సునీల్ కుటుంబానికి చెందిన దగ్గర బంధువైన యువరాజును.. సీబీఐ అధికారులు అనంతపురానికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సునీల్ కుటుంబం గతంలో అనంతపురంలో నివాసం ఉన్నారు.. ఈ మేరకు వారి సమాచారం తెలుసుకునేందుకు యువరాజును తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం.

ఇదీ చదవండి:

దేవినేని ఉమకు 14 రోజుల రిమాండ్, రాజమండ్రి జైలుకు తరలింపు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.