ETV Bharat / state

వివేకా హత్య కేసు.. సస్పెన్షన్​లో ఉన్న సీఐ శంకరయ్యను విచారిస్తున్న అధికారులు - వైయస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. నేడు సస్పెండ్ అయిన పులివెందుల సీఐ శంకరయ్యను విచారిస్తున్నారు. ఇంకా అనుమానితుల జాబితాలో 15 మందిని చేర్చినట్లు తెలుస్తోంది. వీరిలో వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తదితరులు ఉన్నట్లు సమాచారం.

cbi enquiry on ys viveka murder case
వైయస్ వివేకా హత్య కేసు
author img

By

Published : Jul 27, 2020, 2:31 PM IST

Updated : Jul 27, 2020, 8:14 PM IST

మాజీమంత్రి వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన సీబీఐ... ఇవాళ్టి నుంచి కడప కేంద్రంగా విచారణ చేపట్టింది. 10 రోజులపాటు పులివెందులలో ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన అధికారులు వివేకా ఇంటిని పరిశీలించారు. సిట్ దర్యాప్తు నివేదికను పులివెందుల పోలీసులు సీబీఐకి అప్పగించారు. 3 సంచుల్లో ఉన్న నివేదికలను స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు ఈరోజు నుంచి ప్రత్యేక విచారణ అధికారి సమక్షంలో విచారణ చేపట్టారు. ఈ మేరకు కడప ఆర్అండ్​బీ కేంద్ర కారాగారంలోని అతిథి గృహానికి అధికారులు చేరుకున్నారు.

అక్కడే దస్త్రాలను పరిశీలించి.. అనుమానితులను పిలిపించి విచారించే అవకాశం ఉంది. ఇప్పటికే 15 మంది అనుమానితుల జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం. ఆ జాబితాలో వైఎస్​ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, బాబాయ్ మనోహర్ రెడ్డితో పాటు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నేడు సస్పెన్షన్​లో ఉన్నపులివెందుల సీఐ శంకరయ్యను విచారిస్తున్నారు. వివేకా హత్య జరిగిన రోజు శంకరయ్య ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు.

ఇవీ చదవండి..

'విలన్‌గా చూడలేం.. హీరో పాత్ర వేయాల్సిందే'

Last Updated : Jul 27, 2020, 8:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.