ETV Bharat / state

వివేకా కేసు: మున్నాపై సీబీఐ కన్ను - ex minister vivekanandareddy murder case latest news update

కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. ఆర్థిక లావాదేవీల కోణంలోనే ఎక్కువగా దృష్టి సారించిన సీబీఐ... మున్నాతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు అప్పులు ఇచ్చారు అన్నదానిపై కూపీ లాగుతోంది.

cbi enquiry on ex minister vivekanandareddy murder
మాజీ మంత్రి వై.ఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ
author img

By

Published : Sep 29, 2020, 10:05 AM IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో అనుమానితులను సీబీఐ విచారిస్తోంది. పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాతో సంబంధం ఉన్న ఓ వ్యక్తిని సీబీఐ అధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. కేసులో ఆర్థిక లావాదేవీల కోణంలోనే సీబీఐ ఎక్కువగా దృష్టి సారించింది. మున్నాతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయి, ఎవరెవరు అప్పులు ఇచ్చారు అన్నదానిపై సీబీఐ కూపీ లాగుతోంది. ఇప్పటికే కడపకు చెందిన ముగ్గురు చెప్పుల షాపు డీలర్లను విచారించిన సీబీఐ.. మున్నాతో దగ్గర సంబంధం ఉన్న వ్యక్తిని విచారిస్తున్నట్లు సమాచారం. 3 నెలల నుంచి పులివెందులలో చెప్పుల దుకాణాన్ని మూసివేసినా.. మున్నా బ్యాంకు లాకరులో రూ.48 లక్షల నగదు, 25 తులాల బంగారం ఎలా ఉందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ హత్యకు, లాకర్లలో ఉన్న సొత్తుకు సంబంధాలున్నాయా... అనే అంశాలపై దృష్టి సారిస్తూ ప్రశ్నించారు. చిట్టీలు కట్టడం ద్వారా వచ్చిన సొమ్మును తాను భద్రపర్చుకున్నానని మున్నా చెప్పగా.. ఎవరెవరి వద్ద చిట్టీలు కట్టారో తెలుసుకున్నారు. వారిని పిలిపించి విచారించారు.

కాణిపాకం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..

రాజశేఖర్... వివేకాకు సంబంధించిన వ్యవసాయ పనులు చూస్తుంటారు. హత్య జరిగిన ముందు రోజు తాను కాణిపాకంలో ఉన్నట్లు సీబీఐకి ఆయన వివరించారు. ఎప్పుడూ వివేకా వెంట ఉండే ఆయన ఆ రోజు కాణిపాకం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? హత్యా ప్రణాళిక ముందే ఏమైనా తెసుసా..? అనే అంశాలపై వివరాలు సేకరించారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులు రాజశేఖర్ ను ఇటీవల కాణిపాకానికి తీసుకెళ్లారు. హత్య జరిగిన ముందు రోజు అక్కడ ఎక్కడెక్కడ తిరిగారు..? ఎవరెవరిని కలిశారనేది తెలుసుకున్నారు.

ఆ రాత్రి ఏం జరిగింది..?

ట్యాంకర్ భాషా... ఈయన కూడా వివేకాకు సంబంధించిన పొలం పనులు చూస్తుంటారు. హత్య జరిగిన రోజు రాత్రి ఈయనే వివేకాకు భోజనం వడ్డించినట్లు సమాచారం. వివేకా తిన్నాక ఎన్ని గంటల వరకు భాషా అక్కడున్నారు... ఆ సమయంలో ఇతరులెవరైనా ఇంట్లో ఉన్నారా... ఆ రాత్రి ఆయన ఉన్నంతసేపు ఏం జరిగింది..ఎవరెవరు వివేకాను కలిశారు.. అనే అంశాలపై ప్రశ్నించారు. ఇటీవల ఆయన్ను వెంటబెట్టుకుని సీబీఐ అధికారులు వివేకా ఇంటికి వెళ్లి హంతకులు ఏ వైపు నుంచి ప్రవేశించేందుకు అవకాశముందనే అంశంపై వివరాలు రాబట్టినట్లు తెలిసింది.

మృతి సంగతి ముందే ఎలా తెలిసింది...!

ఉదయ్ కుమార్ రెడ్డి... కడప ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడు. యూరేనియం కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగి. కేసులో సీబీఐ దర్యాప్తును కోరుతూ వివేకా కుమార్తె ఎన్. సునీత లోగడ హైకోర్టులో వేసిన అఫిడవిట్ లో ఈయనపైనా అనుమానం వ్యక్తం చేశారు. ఉదయ్ కూమార్ రెడ్డికి వివేకా మృతి సమాచారం అందరికంటే ముందే తెలుసు. దాంతో వేకువజామున 3.30కు ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. అని ఉదయ్ కుమార్ రెడ్డి తల్లి సాధారణ సంభాషణల్లో ఆమె స్నేహితులకు చెప్పారంటూ అఫిడవిట్ లో సునీత ప్రస్తావించిన విషయం తెలిసిందే.

ఆ సమయంలో అక్కడెందుకు తిరిగారు..?

వివేకా ఇంట్లో పనిచేసేవారు, కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు, ఆర్ధిక లావాదేవీలు చూసేవారు, హత్య జరిగిన సమయంలో వివేకా ఇంటి సమీపంలో పులివెందులలో అనుమానాస్పదంగా సంచరించిన వారిని సీబీఐ అధికారులు విచారించారు. ఈ కోణంలోనే చంటి అనే హిజ్రాను ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు ఉదయం వివేకాను కలవటానికి వెళ్లిన వైకాపా కార్యకర్త శశికళను విచారించారు. కడపకు చెందిన ముగ్గురు మహిళలను విచారించారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రి వైద్యుడు డాక్టర్ చిన్నప్పుడు, పులివెందులకు చెందిన ఇద్దరు దర్జీలు, ఇద్దరు రైతులు, వాలంటీరును పిలిచి వివధ అంశాలపై సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇవీ చూడండి...

వివేకా హత్య కేసు: సీబీఐ ముందుకు మున్నాతో పాటు చెప్పుల డీలర్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.