కడప జిల్లా పులివెందులను ఫ్యాక్షన్, గుండాల రాజ్యమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ అన్నారు. తమ ప్రాంతంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్‌పై పులివెందుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.
ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన ఘనత పులివెందులకు ఉందని వరప్రసాద్ అన్నారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని.. అలాగే పులివెందుల ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.