ETV Bharat / state

అర్థరాత్రి ఛేజింగ్‌: దొంగలు దొరక లేదు... దుంగలు చిక్కాయి... - కడపలో ఎర్ర చందనం స్మగ్లింగ్​

గుర్తు పట్టలేరనుకున్నారో ఏమో... కారుకు లాక్‌ చేసి విడిచిపెట్టి తప్పించుకున్నారు. అధికారులు మాత్రం స్మగ్లింగ్‌ వాహనాన్ని పసిగట్టేశారు. ఈ ఛేజింగ్‌లో దొంగలు దొరక లేదు కానీ ఎర్రచందన దుంగలు చిక్కాయి.

ఎర్ర చందనంతో దొరికిన కారు
author img

By

Published : Oct 22, 2019, 4:59 PM IST

కడప జిల్లా వల్లూరు మండలం గోటూరు గ్రామంలో ఓ కారును దుండగులు అర్థరాత్రి వదిలి వెళ్లారు. అధికారులు తనిఖీ చేసి... అందులో 2 లక్షల విలువైన 8 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఖాజీపేట మండల అటవీ ప్రాంతం నుంచి ఈ కారును అటవీ అధికారులు వెంబడించారు. వారి నుంచి తప్పించుకునేందుకు గోటూరు గ్రామంలో కారును విడిచిపెట్టి వెళ్లిపోయారు స్మగ్లర్లు. ఎవరూ గుర్తించలేరనే ధీమాతో లాక్ చేసి పరారయ్యారు. నెంబర్‌ ఆధారంగా ఈ వాహనాన్ని గుర్తు పట్టిన అధికారులు... కారును కడప తీసుకెళ్లారు. అందులో లభించిన సాక్ష్యాల ఆధారంగా నిందితులను వెతికే పనిలో ఉన్నారు.

ఇదీ చదవండి

బోటుకు మరో రోప్​.. నదిలోకి డైవర్స్​!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.