కడప జిల్లా దువ్వూరు మండలం గుడిపాడు వద్ద జాతీయ రహదారిపై ప్రమాదం చోటు చేసుకుంది. కారు బోల్తా పడిన ఘటనలో తిరుపతికి చెందిన కాటంరెడ్డి రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి నుంచి నంద్యాలకు వెళ్తుండగా డివైడర్ను ఢీకొని కారు బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన రాజశేఖర్ రెడ్డిని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి