ETV Bharat / state

'రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి' - మూడు రాజధానులు వార్తలు

రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయకపోతే గ్రేటర్‌ రాయలసీమ ఉద్యమం తప్పదని మాజీ మంత్రి మైసూరా రెడ్డి తెలిపారు. దీనిపై త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

mysura reddy
mysura reddy
author img

By

Published : Jul 31, 2020, 7:54 PM IST

రాయలసీమకు కేవలం హైకోర్టు ఇచ్చి దానికి న్యాయ రాజధాని అని పేరు పెట్టడం సరికాదని మాజీ మంత్రి ఎంవీ మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. హైకోర్టు వల్ల రాయలసీమకు వచ్చే ప్రయోజనం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్​లో మీడియాతో ఆయన మాట్లాడారు.

రాజధానిని రాయలసీమలో ఏర్పాటు చేయకపోతే గ్రేటర్‌ రాయలసీమ ఉద్యమం తప్పదని ఎంవీ మైసూరా రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం రాయలసీమ ముఖ్య నేతలు త్వరలో సమావేశమై ఓ కార్యాచరణ రూపొందిస్తామని ఆయన వివరించారు. కంటితుడుపు చర్యల వల్ల రాయలసీమకు ప్రయోజనం ఉండదని మైసూరా రెడ్డి పేర్కొన్నారు.

ఇదీ చదవండి

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.